Protect the Andhra Pradesh State Archives and Government Oriental Manuscripts Library
Background: The Andhra Pradesh Reorganization Act ("Telangana Bill") to bifurcate Andhra Pradesh into two new states, "Telangana" and "residuary Andhra Pradesh," was finalized on March 1, 2014. The new state boundaries are scheduled to take effect on June 2, 2014. The Act stipulates that the governor will administer Hyderabad as the joint capital of both states until a new capital is named for residuary Andhra Pradesh. This is a period not to exceed ten years. Following the State Chief Minister’s resignation in February, Andhra Pradesh has been under “President’s Rule.” At present, many details of the separation have not been formalized and there is significant uncertainty and confusion surrounding the responsibilities of government officers and employees, including at government-managed research and archival institutions. Both the Andhra Pradesh State Archive and the Government Oriental Manuscript Library are slated for bifurcation and their collections will be divided between Telangana and Residuary Andhra Pradesh.
An Appeal from Research Scholars and the Broader Intellectual Community
We, the undersigned, express our deepest concerns over the troubling method and manner of division currently being initiated at the Andhra Pradesh State Archives and the Andhra Pradesh Government Oriental Manuscripts Library. The dissolution of Andhra Pradesh state and the formation of the new Telangana and Residuary Andhra Pradesh States has created the need to apportion state administrative functions at all levels, including these research institutions. We recognize that the manuscripts, printed books, and records preserved in the State Archives and the Government Oriental Manuscripts Library are invaluable and irreplaceable sources of regional, national, and global history. In particular, the Government Oriental Manuscripts Library deserves special attention as the heir to the historical Asafiya State Central Library collection, which is an invaluable record of Hyderabad’s cosmopolitan history.
The Asafiya Library was founded in the final decades of the Hyderabad princely state thanks to the efforts of Maulvi Syed Hussein Bilgrami, the Nawab Imad-ul-Mulk. His personal library formed the seed of this collection, but it soon became one of the largest and richest collections in the whole of India. In 1967 the oldest and most valuable part of the library, more than 17,000 volumes in Telugu, Urdu, Arabic, Persian and Sanskrit dating from the 7th century through the 19th century, was shifted to the care of the Andhra Pradesh Government Oriental Manuscript Library. This collection reflects the richness and diversity of Hyderabad’s Deccan heritage and should not be carelessly divided. We urge the authorities to treat these materials with the proper sensitivity and consideration they deserve.
In this regard, we humbly petition the governor of the state with three requests:
1. Transparency: We request that the directors of both institutions communicate to the public their overall vision and plan for the separation of these historical materials. This should include a timeline, a list of responsible actors along with their duties and responsibilities, and justifications for the proposed separations.
2. Temporary Advisory Committee: The separation of materials should not be arbitrary or guided by contemporary political concerns. We request the governor to appoint a temporary advisory committee of research scholars and librarians who have expertise on the materials housed in the State Archives and the Manuscripts Library. This committee will be responsible for ensuring the integrity of particular collections and providing its informed and unbiased opinion during the separation process.
3. Funding: Both the State Archives and the Manuscripts Library have suffered from underfunding and a shortage of qualified employees for many years. The collections at both institutions are in a fragile condition and much of the material remains either entirely uncatalogued or minimally catalogued. Without a clear sense of the content and value of their holdings, any bifurcation undertaken will be arbitrary and the materials selected for shifting will be at risk of being destroyed or lost. We request that a special budget be prepared for this project so that both institutions may temporarily expand their skilled staff to meet the requirements of this sensitive undertaking. Given that Hyderabad will remain the joint capital for the next ten years, we hold that there is no need for the immediate separation of these materials. This is a process that will require time and careful consideration. We look on this historic moment as a unique opportunity to re-catalogue and re-assess the holdings of both institutions. This will ensure a proper accounting of their inventory and lead to the informed separation of these invaluable and irreplaceable materials.
This petition represents the concerns and interests of leading research institutes, learned societies, scholars (both local and international), students, journalists, social activists, and concerned members of the public at large. We are in the process of taking an appointment with the governor and this petition will be personally submitted to him by a group of concerned citizens.
Please voice your support by contributing your signature to the list below.
Signed,
Mukta, A Telangana Women’s Collective: K. Vimala, K. Kirankumari, S. Sandhya, A. Sridevi
Telangana Resource Center: M. Vedakumar
Center for Deccan Studies: Dr. Oudesh Rani Bawa, Sajjad Shahid
Hyderabad History Society: Dr. Anuradha Reddy
Telangana History Society: Sangisetti Srinivas
Telangana Vidyavanthula Vedika: Sridhar Rao Deshpande
Anveshi, Resource Center for Women: Dr. Sunita, Gogu Shyamala, Shahjahana
Muchukunda Foundation: P. Srisailam
Telangana Senior Citizens Association: C.H. Ramulu
Telangana Netizens for Social Justice: K. Jaswanth, K. Karunakar Reddy
Forum For Better Hyderabad: Omim Maneckshaw Debara, M. Vedakumar
INTECH (Hyderabad): Dr. Anuradha Reddy
Former Director, Andhra Pradesh Government Oriental Manuscripts Library: Professor Jayadhir Tirumala Rao
Former Director, Andhra Pradesh State Archives: Dr. Vasant Bawa
(News Coverage):
"Division of cultural assets must involve all stakeholders"4/29/2014
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Division-of-cultural-assets-must-involve-all-stakeholders/articleshow/34345202.cms
పరిశోధకుల, విద్యావంతుల, మేధావుల విజ్ఞప్తి
తెలంగాణ, సీమాంధ్ర స్టేట్స్ ఏర్పడుతున్న సందర్భంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో విభజన కార్యక్రమం శరవేగంతో జరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నిజాం కాలం నుండే సేకరించబడిన ఎన్నో విలువైన తెలుగు, ఉర్దు, పర్శియన్, అరబిక్, సంస్కృత భాషల్లోని లిఖిత గ్రంథాలూ, తాళపత్ర గ్రంథాలూ, దస్తావేజులు భద్రపరిచిన ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, స్టేట్ అర్కైవ్స్‌లో కూడ విభజన చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో పౌరసమాజ సభ్యులుగా మేం రాష్ట్ర గవర్నర్ గారికి కొన్ని విజ్ఞాపనలు చేస్తున్నాం.
అవి:
1. పారదర్శకత: ప్రాచీన జాతీయ, స్థానిక చరిత్రలకు సంబందించిన విలువైన లిఖిత పత్రాలూ, తాళపత్రాలూ, దస్తావేజులనూ ఒకవేళ వేరు చేయాల్సిన అవసరం వస్తే శాస్త్రీయమైన పద్ధతిలో చేయాలని కోరుతున్నాం. పైన సూచించిన రెండు సంస్థల డైరెక్టర్లు వెంటనే విభజన సందర్భంలో తమ ప్రణాళికలను, క్రమబద్ధీకరణ పనులను గురించి ప్రజలకి స్పష్టంగా వివరించాలి.
2. తాత్కాలిక సలహా సంఘం: పైన వివరించిన పనులను పర్యవేక్షించేందుకు నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించాలని కోరుతున్నాం. హైదరాబాదులోని ఆర్కైవ్స్, ప్రాచ్య లిఖిత గ్రంథాలయాలలోనే కాకుండ పూర్వాంధ్ర ప్రదేశ్‌లోని అన్ని ప్రాచీన లిఖిత భాండగారాల్లోని ప్రతులను డిజిటలైజ్ చేసి పరిరక్షించడమే కాకుండా ఆయా గ్రంథాలయాలలోని ప్రతులను కదలించకుండా జాగ్రత్తగా సంరక్షించాల్సిన పనులను చేపట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రస్థుతం స్టేట్ అర్కైవ్స్, ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయాలలో ఉన్న విలువైన తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన చారిత్రకపత్రాలను సంరక్షించడానికి నిపుణులయిన లైబ్రేరియన్లతోపాటుగా విషయ జ్ఞానమున్న పరిశోధకులతో కూడిన ఒక తాత్కాలిక సలహా సంఘాన్ని గవర్నర్ గారు వెంటనే నియమించాలి.
3. నిపుణులైన తాత్కాలిక ఉద్యోగుల నియామకం: నిపుణులైన ఉద్యోగుల కొరత ఉన్న సందర్భానికి తోడు తొందరగా చేయాల్సిరావడంలోని ఆతృతలో అనేక డాక్యుమెంట్స్ నాశనమవుతున్న ప్రత్యక్ష అనుభవం లోంచి ఈ పిటిషన్ దారులుగా మేం గవర్నర్ గారిని వెంటనే నష్ట నివారణ చర్యులు చేపట్టాలని కోరుతున్నాం. అందుకోసం వెంటనే ఈ రెండు సంస్థల్లోని పరిశోధక సామాగ్రి భద్రత, సంరక్షణ పనుల్లో మరింత నైపుణ్యం ఉన్న వారిని నియమించాలి. తక్షణమే కొంత బడ్జెట్ మంజూరు చేసి తాత్కాలికంగానైనా ఉద్యోగులను నియమించాలి.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరి కొన్ని సంవత్సరాలు కొనసాగాల్సిన ప్రస్థుత సందర్భంలో స్టేట్ అర్కైవ్స్, ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయాలలోని ప్రతులను ఇప్పటికి ఇప్పుడే వేరు చేయాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం. నిజానికి ఈ సందర్భాన్ని అమూల్యమైన పరిశోధక పత్రాలను, చారిత్రక ఆనవాళ్ళను మరింత శాస్త్రీయంగా పరిష్కరించి, రీక్యాటలాగ్ చేయాల్సిన చారిత్రక అవకాశంగా మేం భావిస్తున్నాం. ఈ రకంగా చేయడం వల్ల భావి పరిశోధకులకు ఈ సంస్థల్లో మరింత స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించొచ్చు.
చివరగా మేం, అంటే ఈ కింద సంతకాలు చేసిన వాళ్ళం, ప్రస్థుతం విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌లలో జరుగుతున్న అవకతవకల గురించి తీవ్రంగా పరిగణిస్తున్నాం. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వ సంస్థలను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని మేం గుర్తిస్తున్నాం. కాని, అదే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతల గురించి ముఖ్యంగా పరిశోధన సంస్థల్లో క్రమబద్ధీకరణలను మేం గవర్నర్ గారి దృష్టికి తేవాలనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, స్టేట్ ఆర్చైవ్స్‌లోని అమూల్యమైన చారిత్రక పత్రాలు, పరిశోధక గ్రంథాలు, స్థానిక జ్ఞానాలకి సంబందించిన విలువైన సమాచారాన్ని కాపాడుకోవల్సిన కర్తవ్యం కేవలం స్థానిక ప్రభుత్వాలకే కాక స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ పరిశోధకులకు అనివార్యం. ఈ నేపథ్యంలో అనేక పరిశోధక సంస్థలతో పాటుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న పరిశోధకులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్ట్‌లు, వివిధ ప్రజాసంఘాలలోని సామాజిక కార్యకర్తులు మరియు పౌరసమాజ సభ్యులు గవర్నర్ గారికి పంపుతున్నఈ ఉమ్మడి విజ్ఞాపనకు ఇప్పటికే సంఘీభావం తెల్పిన సంస్థల వివరాలు, వ్యక్తుల సంతకాలు కింద చూడొచ్చు.
మీరు కూడా సంతకం చేసి మీ సంఘీభావం తెల్పండి.
సంతకాలు:
ముక్త, తెలంగాణ వుమెన్స్ కలెక్టివ్: కె. విమల; కె. కిరణ్‌కుమారి; ఎస్. సంధ్య; ఏ. శ్రీదేవి
తెలంగాణ రిసోర్స్ సెంటర్: ఎం. వేదకుమార్
సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్: డా. అవదేష్ రాణి భావ, సజ్జద్ షాహిద్
తెలంగాణ హిస్టరి సోసైటి: సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ విద్యావంతుల వేదిక: శ్రీధర రావు దేశ్‌పాండె
అన్వేషి, రిసర్చ్ సెంటర్ ఫర్ వుమెన్: డా. సునీత; గోగు శ్యామల; షాజహాన
ఇంట్యాక్ (హైదరాబాద్): డా. అనురాధ రెడ్డి
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్: సి.హెచ్. రాములు
తెలంగాణ నెటిజన్స్ ఫర్ సోషల్ జస్టిస్: కె. జస్వంత్; కె. కరుణాకర్ రెడ్డి
ముచుకుంద ఫౌండేషన్: పి. శ్రీశైలం
ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్: ఓమిం మానెక్షాహ్ దేబార, ఎం. వేదకుమార్
హైదరాబాద్ హిస్టొరి సోసైటి: డా. అనురాధ రెడ్డి
పూర్వ డైరెక్టర్, ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం: ప్రొ. జయధీర్ తిరుమల రావు
పూర్వ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అర్కైవ్స్: డా. వసంత్ భావ
(News Coverage):
"తరలుతున్న తాళపత్రాలు!" 3/30/2014
http://namasthetelangaana.com/Sports/article.aspx?category=1&subCategory=2&ContentId=349247
"చారిత్రక సంపదను కాపాడుకోవాలి: వేదకుమార్" 4/12/2014
http://namasthetelangaana.com/News/article.aspx?category=1&subCategory=2&ContentId=353615
Comment